వికలాంగుల జేఏసీ జిల్లా కో కన్వీనర్ గా రాజశేఖర్
ఎల్లారెడ్డిపేట, పెన్ పవర్రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజశేఖర్ ను బుధవారం వికలాంగుల జేఏసీ జిల్లా కన్వీనర్ కాసారపు పరశురాములు నియమించారు. ఈ సందర్భంగా మేడిశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల సాధనే లక్ష్యంగా పోరాడతానని అన్నారు. అలాగే దివ్యాంగులకు రావాల్సిన పథకాలు విద్య వైద్యం ఉపాధి మరియు సంక్షేమ పథకాల్లో దివ్యాంగుల హక్కులు సాధించే దిశగా దశలవారీగా పోరాటం చేయుటకు సంకల్పించి తెలంగాణ రాష్ట్రంలో కలిసివచ్చిన సంఘాలతో కూడా పోరాటం చేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు కాసారపు పరుశరాములు గారికి స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముత్తినేని వీరయ్య మొగిలి లక్ష్మయ్య అడివయ్య సతీష్ మండేపల్లి రవి లకు కృతజ్ఞతలు తెలిపారు.
No comments:
Post a Comment