టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు
లక్షెట్టిపెట్, పెన్ పవర్టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల క్షేమంకోరే ప్రభుత్వం అని రైతుల కష్టాలు తీర్చే ప్రభుత్వం అని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్రావు అన్నారు. మండలం లోని చందారం, కొత్తూర్, ఇటిక్యాల జెండా వెంకటపూర్, బలరావుపేట్, సురారం, గుళ్లకోట, లక్ష్మిపూర్, గ్రామాల్లో ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులకు మేలు ఏదైనా ఉంటే ఒక్కటి చెప్పాలని అన్నారు. తెలంగాణ స్వరాష్టం ఏర్పాటు తర్వాత రైతులకు పెట్టుబడి సాయం ఉచిత కరెంట్ సబ్సిడీపై విత్తనాలు ఎరువులు మొత్తం తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఇవే కాకుండా రైతులు దళారుల చేతుల్లో మోసపోకూడదని ప్రతీ గ్రామంలో రైతులకు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసారన్నారు.రైతులు నాణ్యమైన మంచి ఎగ్రేడ్ ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని కోరారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గతంలో రైతులు లారీల కోసం ఇబ్బంది పడ్డ విధంగా ఈ సారి పడుకుండా ఉండాలని లారీల కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిందని లారీ కావాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి తెప్పించు కోవలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చెర్మాన్ తిప్పని లింగన్న,పిఎసిఎస్ చెర్మాన్ గోళ్ళ కాంతయ్య, వైస్ చెర్మాన్ సురేష్, సర్పంచులు సురేష్, చుంచు రవి, జశ్వంత్, గోళ్ళ రవీందర్, అసాది పురుషోత్తం, ఎంపీటీసీలు దావీదు, సరిత, మాజీ డీసీఎంఎస్ చెర్మాన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అంకతి రమేష్, తిరుపతి, సత్తయ్య రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment