Followers

జొన్నాడలో సారా బట్టీల పై ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక బృందం దాడులు

 జొన్నాడలో సారా బట్టీల పై ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక బృందం దాడులు

పెన్ పవర్, ఆలమూరు 

    ఆలమూరు మండలం జొన్నాడ గోదావరి లంక పంట భూముల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కాకినాడకు చెందిన ప్రత్యేక ఎక్సైజ్ పోలీసు బృందం జరిపిన దాడుల్లో భారీ ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం ఎస్ఐలు రామకృష్ణ, ఎస్ఎస్ డివి ప్రసాద్ లు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు వీరికి ఇచ్చిన సమాచారంతో సోమవారం జొన్నాడ గౌతమీ నదీ తీరాన గల లంక భూముల్లో ఆకస్మిక దాడులు నిర్వహించగా సుమారు 48 పీపాల్లో సారా తియ్యడానికి నిల్వ ఉంచిన 9,600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు వారు తెలిపారు. కాగా సారా తయారు చేస్తున్న వారు పరారైనట్లు తెలిపారు. సారా తయారు చేస్తున్న ఈ ప్రాంతాల్లో స్పెషల్ స్క్వాడ్ నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో ఆలమూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై పట్టాభిరామయ్య చౌదరి, ఆలమూరు ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...