Followers

ప్రైవేట్ టీచర్లకు ఆసరాగా ప్రభుత్వం : ఎమ్మెల్యే బేతి

 ప్రైవేట్ టీచర్లకు ఆసరాగా ప్రభుత్వం : ఎమ్మెల్యే బేతి 

తార్నాక, పెన్ పవర్ 

కరోనా నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నా కారణంగా, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2వేలు ఆపత్కాల ఆర్ధిక సాయం తో పాటు కుటుంబానికి 25 కేజీల సన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా చిల్కనగర్ డివిజన్ పరిధిలోని న్యూ రాంనగర్  కాలనీలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మరియు చిల్కానగర్ డివిజన్  కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ లు  పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  మాట్లాడుతూ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతి ఒక్కరిని తన అక్కున చేర్చుకొని ఆపద్బాంధవుడు లాగా అందరినీ ఆదుకున్నారని కొనియాడారు. కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ ఇంత విపత్కర మైన సమయంలో కూడా రాష్ట్రాన్ని ఎటువంటి ఇబ్బంది పాలు కాకుండా చూసుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ అని ,వారు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో ఉండాలని, వారు క్షేమంగా ఉన్నంతవరకు తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది జరగదని, ఆ భగవంతుడు కేసీఆర్ గారికి మరింత శక్తిని ఇయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, సివిల్ సప్లై ఆఫీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...