Followers

ఆడపిల్లలకు అండగా సీఎం కేసీఆర్.

 ఆడపిల్లలకు అండగా సీఎం కేసీఆర్.

ఎమ్మెల్యే శంకర్ నాయక్

కేసముద్రం, పెన్ పవర్

రాష్ట్రంలోని  ఆడపిల్లల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ప్రజలకు  అండగా నిలుస్తుందని మహబూబాబాద్ శాసనసభ్యులు భానోత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం  మండల కేంద్రంలో 150 మంది లబ్ధిదారులకు 15,002,400 విలువగల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్  చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ  ఆడపిల్లల పెళ్లి సందర్భంగా తల్లిదండ్రులకు భారం పడకూడదనే  ఉద్దేశంతో తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ ద్వారా ఆదుకుంటున్నదని తెలిపారు.గతంలో రూ 51000,75116/-ఉన్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వివాహ కానుకను 1,00,116లు కు పెంచడం జరిగింది అని  అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో నిరుపేదలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.కరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని,భౌతిక దూరం పాటించాలి అని పేర్కొన్నారు. కరోనా టెస్టులు ప్రతి ఒక్కరు చేయించుకోవాలి అని ఈ సందర్బంగా అయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వొలం చంద్ర మోహన్ ,జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, సర్పంచుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు మాదరపు సత్యనారాయణ రావు, తెరాస  మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఎండి నజీర్, దామరకొండ ప్రవీణ్,కమటం శ్రీనివాస్, పీఎసీస్ చైర్మన్ దీకొండ వెంకన్న ,వీరు నాయక్,స్థానిక సర్పంచులు,బట్టు శ్రీను,  ప్రభాకర్, కోమటిపల్లి నీలం యాకయ్యలు ఎంపీటీసీలు, అధికారులు , తెరాస ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...