నాణ్యమైన రోడ్లతో తీరిన ఇక్కట్లు
పెన్ పవర్, వలేటివారిపాలెం
నూతన సర్పంచ్ రాక నాణ్యమైన అంతర్గత రహదారుల అనుసంధానం రోడ్లు రూపకల్పన చేసుకోవడంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య. ఆ కల సహకారం అయిందని అంక భూపాల పురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ ప్రగడ ఆదిలక్ష్మి గ్రామంలో క్షేత్రస్థాయి లో పర్యటన చేసి గ్రామ ప్రజల, గ్రామ పెద్దలకు అనుకూలంగా ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని అంతర్గత రోడ్లు అభివృద్ధి పరిచారు. అంక భూపాలపురం, గరుకు పాలెం రెండు గ్రామాలను కలుపుతూ పొలాల్లోకి వెళ్లే అంతర్గత రోడ్లు వేసి అభివృద్ధి పరిచారు. ప్రభుత్వ నిబంధనల ప్రమాణాలకు ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇంకా మెరుగ్గానే గ్రామంలో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నాణ్యమైన పటుత్వం కలిగిన మట్టి ఏర్పాటు చేయడంతో ఆ రోడ్లు పది కాలాల పాటు మన్నికంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ రహదారి పై పంట పొలాల్లో నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఇంటికి తీసుకుని రావాలంటే నానా అగచాట్లు పడే వాళ్ళు. రోడ్డు మీద గుంటలు, రాళ్లు, రోడ్డు కు ఇరువైపులా చిల్ల చెట్లు కుమ్మేసి కనీసం నడిచి వెళ్ళలేక, వాహనాలు పోక అగచాట్లు అన్నీ ఇన్నీ కాదు. సమయంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. ప్రస్తుతం సర్పంచ్ రాకతో రహదారులు అభివృద్ధి చేయడం వల్ల ఇప్పుడు ఇక బాధలన్నీ తీరిపోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ రుణాన్ని తీర్చుకున్నారని పలువురు స్థానికులు ప్రశంశలు వెలుబుచ్చుతున్నారు. సర్పంచ్ భవిష్యత్తులో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.గురువారం సర్పంచ్ ప్రగడ ఆదిలక్ష్మి పెన్ పవర్ తో మాట్లాడుతూ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సహాయ సహకారాలతో గ్రామ పెద్దల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. 14వ హార్దిక సంఘ అ నిధులతో ఎమ్మెల్యే సహకారంతో గ్రామ పెద్దల సూచనల మేరకు పంచాయతీ పరిధిలోని అంక భూపాలపురం, రామచంద్రపురం గ్రామాల్లోని లింకు రోడ్లు పొలాల్లోకి వెళ్లే రోడ్లను రహదారులను అభివృద్ధి పరిచాం. ఇప్పటి లాగే ఇక ముందు కూడా ప్రజల అభిప్రాయం తీసుకుంటూ, గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.
No comments:
Post a Comment