కార్మిక లోకాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సిఐటియు వినతి
కరోనా తో జీవనోపాధి కోల్పోయిన కార్మిక లోకాన్ని ప్రభుత్వంమే ఆదుకోవాలని కోరుతూ సిఐటియు నాయకులు ఏలేశ్వరం తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు రొంగల ఈశ్వరరావు, పాకలపాటి సోమరాజు మాట్లాడుతూ కోవిడ్ తో ఉపాధి కోల్పోయిన వారికి పూర్తిస్థాయిలో నిత్యవసర వస్తువులు, ఆర్థిక సాయం అందించాలని అన్నారు. అలాగే కోవిడ్ బారిన పడుతున్న వారు అధికంగా పేద మధ్యతరగతి వారైనందన యుద్ధ ప్రాతిపదికన వైద్య సహాయం అందేలా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. కోవిద్ డ్యూటీలో ఉన్న అన్ని శాఖల వారికి, వైద్య ఆరోగ్యశాఖ, ఆశలకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది కి14 రోజులు డ్యూటీ, 14 రోజుల రెస్ట్ ఇవ్వాలని కోరారు. వ్యాక్సినేషన్ సెంటర్లను పెంచి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా మాస్కులు అందించే కార్యక్రమం త్వరితగతిన చేపట్టాలని కోరారు.
No comments:
Post a Comment