Followers

జెడ్పీటీసి, ఎంపిటిసి ఎన్నికలలో వైసీపీకి ఘన విజయం అందజేయాలి

జెడ్పీటీసి, ఎంపిటిసి ఎన్నికలలో వైసీపీకి ఘన విజయం  అందజేయాలి

పెన్ పవర్, ఆలమూరు 

ఈ నెల 8వ తేదీన జరిగే జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును వేసి ఘన విజయం అందజేయాలని ఆలమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలో 18 గ్రామాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలుతో పాటు పలు సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో విజయఢంకా మోగించి ముఖ్యమంత్రి పాలనకు మరింత బలాన్ని అందజేయాలన్నారు. వైసిపి ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారని అన్నారు. మండలంలో మడికి గ్రామం నుండి జెడ్పిటిసి అభ్యర్థిని తోరాటి సీతామహాలక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మడికి, చెముడులంక, గాంధీనగరం, బడుగువానిలంక, చొప్పెల్ల, జొన్నాడ, మూలస్థానం అగ్రహారం, ఆలమూరు   గ్రామాల్లో ఆయా ఎంపిటిసి అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు.  ఈ కార్యక్రమంలో తోరాటి లక్ష్మణరావు, యనమదల నాగేశ్వర్రావు, దియ్యన పెద్దకాపు, పడమటి రాంబాబు, అడబాల వీర్రాజు, తోరాటి రాంబాబు, అడ్డాల సత్యనారాయణరాజు   వివిధ గ్రామాల సర్పంచులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ శ్రేణులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...