Followers

రేఖపల్లి గ్రామంలోరెండు చలివేంద్ర కేంద్రాలు ప్రారంభం

 రేఖపల్లి గ్రామంలోరెండు చలివేంద్ర కేంద్రాలు ప్రారంభం

 వి.ఆర్.పురం, పెన్ పవర్

 వి.ఆర్.పురం మండలం రేఖపల్లి జంక్షన్ వద్ద  ఒకటి,ప్రభుత్వ వైద్యశాల దగ్గర రెండవది, చలివేంద్ర కేంద్రాలు గ్రామ సెక్రెటరీ నూకరత్నం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేఖపల్లి పంచాయతీకి సంబంధించిన  సర్పంచ్ పూనెం సరోజిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. కరోనా విజృంభిస్తున్న కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. వి ఆర్ పురానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బ్యాంకులోనగదు తీసుకొనుటకు  వస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగా లేకపోతే ప్రభుత్వ వైద్యశాలకు మరియు ఇంట్లో అవసరమైన నిత్యావసర వస్తువుల కొరకు కొనుక్కోవడానికి వి ఆర్ పురానికి వస్తూ ఉంటారు.మండలానికి వచ్చి పోయే గ్రామ ప్రజలకు చల్లటి మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో శనివారం రేఖ పల్లి జంక్షన్ లోపందిరి వేసి తడికలు చుట్టూ పెట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ నూకరత్నం పూనెం సత్యనారాయణ గ్రామ వాలంటరీ లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...