పుకార్లు నమ్మకుండా పూర్తి విశ్వాసంతో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి
మందమర్రి, పెన్ పవర్
పట్టణం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం మందమర్రి సీనియర్ పాత్రికేయులు మధ్యల సంజీవ్, మందమర్రి రూరల్ రిపోర్టర్ సకినాల శంకర్ లు కారోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు ఇలాంటి పుకార్లు నమ్మకుండా, పూర్తి విశ్వాసంతో కారోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలని, వ్యాక్సిన్ పై అపోహలు విడనాడి నిర్భయంగా కరోనా మహమ్మారి పై పోరాడాలని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ వాడుతూ కరోనా మహమ్మారి నుండి రక్షించుకోవాలని తెలిపారు.
No comments:
Post a Comment