రిమ్స్ లో సౌకర్యాలు శూన్యం, పేరుకే పెద్ద ఆసుపత్రి
రిమ్స్ ఆస్పత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి గా ఉందని, హాస్పిటల్ కు వచ్చే రోగులకు సౌకర్యాలు శూన్యమని చికిత్స కోసం వల్లే రోగులకు సరైన వైద్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రిమ్స్ కి వెళ్ళే రోగి తీవ్రమైన అనారోగ్యం గురైతే ఇక్కడి వైద్యులు హైదరాబాద్ , నాగపూర్ కు రేఫర్ చేస్తున్నారన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల రోగులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కానీ రిమ్స్ పక్కనున్న ఔషధా సెంటర్ లో 300 సిలిండర్ ఖాళీగా పడి ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుంటే తను స్వయంగా డబ్బులు ఖర్చు చేసి సిలిండర్లలో ఆక్సిజన్ నింపి రోగులకు అందేలా చూస్తానని కోరారు. రిమ్స్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కు అధికారులతో సమన్వయం లేక రిమ్స్ లో ఈ దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. వేర రాష్ట్రాలలో దేవాలయాలు, మస్జిద్ లను సైతం కోవిడ్ సెంటర్లో ఏర్పాటు చేశారని తెలిపారు.అలాగే పవిత్ర రంజాన్ మాసంలో జకాత్ లకు,ఇఫ్తార్ విందులకు ఖర్చు చేసే డబ్బులు రిమ్స్ లో పేదల కోసం వీల్ ఛైర్స్,ఆక్సిజన్ సిలిండర్ ల కోసం ఖర్చు చేయాలని కోరారు, పట్టణానికి చెందిన ప్రజలు కులమతాలకతీతంగా స్పందించి కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేద్దామన్నారు. జిల్లాలో రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మునిగెల నర్సింగ్,మోతిరామ్,రాహుల్ చంద్రల,రాజు యాదవ్,జాభీర్, ముదస్సిర్ నజర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment