భగ్గుమంటున్న భానుడు....!
గత రెండు రోజులుగా 40 డిగ్రీలు..మొదలైన వడగాల్పులు
బయటకివెళ్లాలంటేనే జంకుతున్న జనం - నిర్మానుషంగా పట్టణ రహదారులు
లక్షెట్టిపెట్, పెన్ పవర్
భానుడి భగభగలకు మండల వ్యాప్తంగా ఎండలు దంచుతున్నాయి రెండు మూడు రోజులు గా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. ఈ క్రమంలో శుక్రవారం ఎక్కువగా 42 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మూడు నాలుగు రోజులగా పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదువుతుండగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగాయి దీనికి తోడుగా రెండు రోజులుగా వడ గాడ్పులు కూడా మొదలు కావడంతో ఎండకు జనం అల్లాడిపోతున్నారు.ఎండ తీవ్రతకు శుక్రవారం లక్షెట్టిపెట్ పట్టణ రహదారులు ఉత్కూర్ చౌరస్తా,గాంధీ చౌక్,పాత బస్టాండ్ ఏరియాలలో చాలా వరకు జన సంచారం లేకుండా నిర్మానుష్యంగా మారాయి..
జోరుగా వేసవి వ్యాపారం
ఎండలు ముదరడంతో వేసవి సీజన్ వ్యాపారులతో జోరందుకుంది మండల కేంద్రంలో తదితర ప్రాంతాలల్లో ఎలక్ట్రిషన్ షాపుల వద్ద జనం బరులుదిరుతున్నారు ఎండ నుంచి ఉపశనం పొందేందుకు గాను ప్రజలు ఇప్పటికే తమ ఇంట్లో ఉన్నటువంటి కూలర్లు,ఏసీలను రిపేర్ చేయించడంతోపాటుగా కొత్తవి కొనుగోలు చేస్తున్నారు.అలాగే చల్లని మంచినీళ్ల కోసం కొత్త కుండలను, రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు..
No comments:
Post a Comment