రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో బెస్ట్ టీం అవార్డు కైవసం చేసుకున్న కేసముద్రం క్రీడాకారులు...
కేసముద్రం, పెన్ పవర్ఈ నెల 2,3,4 తేదీల్లో మెదక్ జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జూనియర్ బాయ్స్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కేసముద్రం మండల హాకీ క్రీడాకారుల ప్రతిభకు బెస్ట్ టీం అవార్డు దక్కింది.12 హాకీ స్టిక్స్,12 బాల్స్ మంగళవారం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ మాస్టర్ హాకీ చైర్మన్ రఘునందన్ రెడ్డి ల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం సీనియర్ హాకీ క్రీడాకారులు ప్రసాద్, నరేశ్, గణేష్, మోహన్, వినోద్ పాల్గొన్నారు. అనంతరం క్రీడాకారులు కేసముద్రం ప్రతిభను రాష్ట్ర స్థాయిలో చాటినందుకు గ్రామ పెద్దలు అభినందించారు.
No comments:
Post a Comment