జర్నలిస్టులుకు అక్రిడేషను కార్డులు, హెల్తు కార్డులు వెంటనే మంజూరు చేయాలి
విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే జర్నలిస్టులుకు ప్రభుత్వం అక్రిడేషన్లు,హెల్త్ కార్డులు అందించడంలో జాప్యం చేయకుండా చర్యలు చేపట్టాలని టీడీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలతో పాటు నియోజకవర్గం, మండల స్థాయిలో జర్నలిస్టులు అనేక ఆటు పోట్లు ఎదుర్కొంటున్నారన్నారు. కరోనా కారణంగా పలువురు మృత్యువాత పడడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పరి రక్షణకు హెల్తు స్కీము అమలు చేయాలని, బస్సు పాసులను వెంటనే పునరుద్దరించాలని, జర్నలిస్టులుకు గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పేరుతో జర్నలిస్టులుకు దక్కాల్సిన వాటిని అడ్డుకోవడం తగదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులు సమస్యలను పరిష్కరించాలని కోరారు.
No comments:
Post a Comment