సకాలంలో స్పందించిన ట్రాఫిక్ పోలీసులకు ప్రశంసా పత్రాలు
విజయనగరం,పెన్ పవర్
విజయనగరం జిల్లా, విజయనగరం పట్టణం సమీపంలో జె.ఎన్.టి.యు ఇంజినీరింగ్ కాలేజి జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి సమయంలో గజపతినగరం వైపు నుండి విజయనగరం వైపుగా వస్తున్న బోర్‌వెల్ లారీ ప్రమాదవశాత్తు తిరిగబడి పోయినట్లు సమాచారం అందుకొన్న వెంటనే తక్షణం స్పందించిన విజయనగరం ట్రాఫిక్ సిఐ ఎర్రంనాయుడు, ఎఎస్ఏ దాలినాయుడు, కానిస్టేబుల్ సింహాచలంలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, బోరింగ్ వేసే డ్రిల్ బిట్స్ ను తొలగించి, జేసిబి సహాయంతో లారీని ఎత్తి లారీ క్రింద చిక్కుకుని, గాయపడిన ముగ్గిరిని రక్షించి, గోల్డెన్ అవర్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందేటట్లు చర్యలు తీసుకొని, ముగ్గరు ప్రాణాలు కాపాడారు. విషయం తెలసుకొన్న జిల్లా ఎస్పీ సకాలంలో స్పందించి సంఘటనా స్థలంకు చేరుకొని, క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి చేర్చిన ట్రాఫిక్ పోలీసు అధికారులను శనివారం నాడు జిల్లా పోలీసు కార్యాలయంకు రప్పించి ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలు మరియు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేశారు.
ప్రశంసా పత్రాలు పొందిన వారిలో 1) వై.వి.సి. యం. ఎర్రంనాయుడు, సిఐ, ట్రాఫిక్ పి.ఎస్., విజయనగరం, 2) దాలినాయుడు, ఎఎస్ఏ, ట్రాఫిక్ పి.ఎస్, విజయనగరం వి.ఎస్., 3) సంహాచలం, పోలీసు కాని స్టేబుల్, ట్రాఫిక్ పి.ఎస్, విజయనగరంలు ఉన్నారు. ఎస్ బి అదనపు ఎస్పీ కుమారి. ఎన్.శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్ర రావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావులు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సకాలంలో స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
No comments:
Post a Comment