Followers

భక్తులకు సకల సౌకర్యాలు కల్పించండి

 భక్తులకు సకల సౌకర్యాలు కల్పించండి

పెన్ పవర్, ఆలమూరు 

 ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరులో వేంచేసియున్న శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని  రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తెలిపారు. నెల రోజులు పాటు జరిగే జాతరపై బుధవారం ఆలయ ప్రాంగణంలో ముఖ్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా సబ్ కలెక్టర్, డీఎస్పీలకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం వారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నెల 11వ తేదీ రాత్రి జాతరతో ప్రారంభమయ్యు మే 11వ తేదీ వరకు జరిగే అమ్మవారి తీర్థం, జాతర మహోత్సవం సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తమ చిన్నారులతో వస్తారని, కోవిడ్-19 నిబంధనలను అమలు చేస్తూ భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించాలని వారు అన్నారు. 

అలాగే జాతర సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, రూట్ మ్యాప్ లను, తీర్థంకు కేటాయించిన స్థలాన్ని   పరిశీలించారు. ప్రతిరోజూ (శానిటేషన్) బ్లీచింగ్ చేయించాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు మంచినీటిని ఏర్పాటు చేయాలని అందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. జాతరలో ఎటువంటి అగ్ని ప్రమాదాలకు తావులేకుండ అగ్నిమాపక అధికారులు తగు జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో మద్యం దుకాణాలలో అమ్మకాలు ఆపించాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సిఐ కె మంగాదేవి, తహసీల్దార్ లక్ష్మీపతి, ఆలయ కార్య నిర్వాహక కార్యదర్శి ఏబీజే  రామలింగం, నామాల శ్రీనివాస్, మార్గాని ఏసు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ పోచమ్మ, ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్, పంచాయితీ కార్యదర్శి పి సత్తిబాబు, ఆలయ సిబ్బంది నాగేశ్వర్రావు, పలువురు అధికారులు నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...