ధర్మం వైపు నిలబడతా
గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్
రాష్ట్రం మొత్తం మీద నూతనంగా ఎన్నిక కాబడిన పంచాయతీలోని నూతన పాలకవర్గాలకు ప్రభుత్వం తరుపున అధికారికంగా ప్రమాణస్వీకార కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి సూరు.శ్రీనివాసరావు అధ్యక్షతన నూతన సర్పంచ్ బొత్తాడ.గౌరీశంకర్,ఉప సర్పంచ్ కొత్తకోట.కిషోర్ తో పాటుగా ఆ పంచాయతీ వార్డు సభ్యులు అరుణ ,లక్ష్మి,ఈశ్వరరావు,మంజుల,రవి,శ్రీను,సోములమ్మ,వెంకట్రావు,శోభ రాణి లు ప్రతిజ్ఞ చేసి వారి బాధ్యతలను స్వీకరించారు.నూతన గుమ్మలక్ష్మీపురం గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ బాధ్యతలను స్వీకరించిన అనంతరం గాందిజీకి పూలమాలను వేసి నమస్కరించారు. సర్పంచ్ గౌరీశంకర్ మాట్లాడుతూ నేను ఇదివరకే ఇదే పంచాయతీలో సర్పంచ్ గా పనిచేసానని మళ్ళీ నా మీద నమ్మకంతో నన్ను గెలిపించి నాకు ఈ బాధ్యత ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ ఋణపడి ఉంటానని అన్నారు. రెండవసారి నన్ను గెలిపించి మరింత బాధ్యత నా భుజాలపై ప్రజలు వేశారని ఆ ప్రజలు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ధర్మం వైపు నిలబడి ప్రజాసేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి మన అందరి సమిష్టి కృషి అవసరమని మీ సహకారం మా నూతన పాలకవర్గానికి అవసరమని తెలిపారు.
No comments:
Post a Comment