Followers

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చెయ్యాలి

 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చెయ్యాలి

విజయనగరం, పెన్  పవర్

 విజయనగరం జిల్లాలో 2017-2018 & 2018-2019 సం.నకు గాను ఎన్.ఎస్.ఎఫ్.డి.సి. మరియు ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి. పధకముల ద్వారా 73 మంది లబ్ధిదారులకు చెక్కులు వెంటనే విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోకా రమేష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంపిక కాబడిన లబ్ధిదారులతో కలిసి నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లా అధికారులకు రుణాలకు సంబంధించి చెక్కులు మంజూరు చేయాలని ఆదేశాలు అందినా, కరోనా మహమ్మరి నేపద్యంలో కూడా వారిపై కనీసం దయ లేకుండా వారిని విశ్మరించడం పూర్తిగా హేయమైన చర్యగా భావిస్తున్నాముని, వివిద సందరాలలో అధికారులను సంప్రదించగా నేడో, రోపో అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని, ఆర్థిక ఇబ్బందులతో పూర్తిగా చితికి పోయిన వారి కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఎన్.ఎస్.ఎఫ్.డి.సి. మరియు ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి. ఋణాలు చెక్కులను వెంటనే మంజూరు చేయాలని,  ఎస్సి కార్పొరేషన్ ఇ.డి. అడుగులు వేయక పోవడం చాలా విడ్డూరంగానే ఉన్నదని రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  దళిత హక్కుల పోరాట సమితి విజయనగరం  గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్లు ఆయినాడ కృష్ణ, రేగేటి సంతోష్, పెంట శంకర్ రావు, తలరి ఈశ్వర రావు, శివ కృష్ణ మరియు ఋణ బాధితులు పల్లా అప్పారావు, నరవ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...