సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్
పెన్ పవర్, బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశం లో పాల్గొన్న కుమారి అంగోత్ బిందు, గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్, మహబూబాబాద సమావేశంలో భాగంగా మండలంలోని శాఖల వారీగా సమీక్ష నిర్వహించినారు. గౌరవ చైర్ పర్సన్ కోరిక మేరకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ సూర్యనారాయణ మండలంలో పామయిల్ తోటలు పెంచడానికి గల అవకాశాలు, ఆర్ధిక లాభాలు పై సభ్యులకు అవగాహన కల్పించారు. మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీ రామ్ ప్రస్తుత కరోనా సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు,40 సంవత్సరముల పైబడిన ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ చేయించుకోవలసిన అవశ్యకత పై అవగాహన కల్పించారు, చైర్ పర్సన్, మాట్లాడుతూ అధికారులు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరేలా చూడడంతో పాటు వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని, తధ్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీలవుతుందని ప్రజలకు ప్రజా ప్రతినిధులకు మధ్య వారధిలా పనిచేయాలని అలాగే బయ్యారం మండల అభివృద్ధికి ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే తన పరిధిలో పరిష్కారానికి కృషి చేస్తానని అలాగే జిల్లా మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ సహాయ సహకారాలు, అందదండలతో సమస్యలు పరీష్కరించుకుందామని అంతేగాని సమస్యలు తెలియజేయకుండా మరియు సమస్యలు పరిష్కారం చేయకుండా ఇంకోక్కసారి ఏ మండల అధికారి కూడా సమావేశాలకు రావొద్దని దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమం లో ఎంపీపీ కుమారి చేపూరి మౌనిక, వైస్ ఎంపీపీ తాత గణేష్, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ఎంపీడీఓ చలపతి రావు, తహసీల్దార్, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment