పెండింగులో ఉన్న కేసుల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేయాలి;వనపర్తి జిల్లా ఎస్పీ
వనపర్తి, పెన్ పవర్వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వరావు జిల్లా కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులతో నెలవారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఎస్పీ అపూర్వ రావు పోలీసు అధికారులను గతంలో పోలీస్టేషన్లలో చాలకాలం పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు, పోలీస్టేషన్లలో రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అందుకు గల కారణాలను తెలుసుకొని పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మాస్క్ ధరించకుండా రోడ్లపై తిరిగే వారికి 1000/-రూపాయలు జరిమానాను ఈ చాలన్ ద్వారా విధించాలని ఆదేశించారు. అనంతరం పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. పోలీసు శాఖలో పనిచేసే అధికారులు మరియు సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.అధికారులు సిబ్బంది అందరూ కూడా మాస్కులు ధరిస్తూ,భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ విధులకు హాజరు కావాలని సూచించారు. 5S సిస్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలోని కేసుల ఫైళ్లను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. గుట్కా,మట్కా బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ షాకిర్ హుస్సేన్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్, జమ్ములప్ప, సీసీఎస్,ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, పోలీసు అధికారులు అందరూ తమ తమ పోలీస్ స్టేషన్ల నుండి, కార్యాలయాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
No comments:
Post a Comment