కోవిడ్ కేర్ సెంటర్ పరిశీలన
పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ రెండో దశ వేగంగా, ఉద్ధృతంగా వ్యాపిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గతంలో ఈ కళాశాలలో హోమ్ క్వారంటైన్ సెంటర్ గా ఉంచామని, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చామని తెలిపారు. ఈ సెంటర్లో 125 మందికి బెడ్లు అవకాశం ఉందని, ప్రస్తుతం 45 బెడ్ లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. అయితే 125 బెడ్లు ఉన్నప్పటికీ కేవలం 20, 30 మంది మాత్రమే ఈ సెంటర్ కు వస్తే అందరు జీవనం బాగున్నట్లుగా భావించాలి అని కోరారు. గతంలో కంటే కరోనా తీవ్రంగా కేసులు పెరగడంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుందని ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలలో మార్పు రానిది వృధా అని, నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు అని అందరు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ప్రస్తుతం హాస్పిటల్ లో కూడా బెడ్ లు లేవని ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని బ్లాక్ మార్కెట్ చేతిలో ఉన్న ఆక్సిజన్ ను కేంద్ర ప్రభుత్వం బయటకు తీయాలని అన్నారు.
ఎవరైనా సరే అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిలో ఎలాంటి అనుమానం లేదని కావున ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. కోవిడ్ కేర్ సెంటర్ లో డాక్టర్లు, ఆహారం, చికిత్స అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం పట్ల ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. గత సంవత్సరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగా సహకరించారని అనేక మందిని ఆదుకున్నామని, ఈ సంవత్సరం ఇప్పటికే బ్లీచింగ్ 20 టన్నులు, సున్నం 42 టన్నులకు దాత ఇంటూరి హరిబాబు, భారతి దంపతుల సహకారంతో ఉచితంగా నియోజకవర్గం మొత్తం పంపిణీ చేశామని అన్నారు. సబ్ కలెక్టర్ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని, వారికి కావలసిన సౌకర్యాలకు కొరత ఉన్నా అండగా నిలబడతామని అది మా బాధ్యతే కాదని నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి శ్రీనివాసులు, తహసిల్దార్ సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ మనోహర్, డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ స్వాతి, పట్టణ, రూరల్ ఎస్ఐ లు తిరుపతి రావు, కొత్తపల్లి అంకమ్మ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment