Followers

మళ్లీ ప్రహరీ నిర్మిస్తున్న బిల్డర్ కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది

 మళ్లీ ప్రహరీ నిర్మిస్తున్న బిల్డర్ కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది

బిల్డర్ కు కొమ్ముకాస్తున్న అజ్ఞాత శక్తి ఎవరు..?

పెన్ పవర్, కాప్రా

ఏఎస్ రావు నగర్ డివిజన్ సుబ్రహ్మణ్య నగర్ లక్ష్మీపురంలో ఐ విజన్ సిరిని అపార్ట్ మెంట్ బిల్డర్ ప్రహరీ గోడను తిరిగి నిర్మిస్తుండగా బుధవారం కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు జెసిబి సాయంతో కూల్చివేశారు. ప్రజలకు, కాలనీవాసులకు ఇబ్బంది కరంగా నిర్మించిన ట్రాన్స్ పార్మర్ ను వేరే చోటికి మార్చాలని, రోడ్డు కబ్జా చేసి నిర్మించిన ప్రహరీని లోపలికి జరిపి నిర్మించుకోవాలని కోరిన స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి "నువ్వు కార్పొరేటరైతే డబ్బులు పడేస్తా తీసుకొని పో అని జులుమ్" ప్రదర్శించిన బిల్డర్ కూల్చి వేసిన ప్రహరీని తిరిగి నిర్మించడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన కాలనీ వాసులు జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది జెసిబి సహాయంతో తిరిగి నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరి అండదండలతో అక్రమ నిర్మాణాలు పాల్పడుతున్నారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కూల్చి వేసినప్పటికీ తిరిగి నిర్మించడంలో ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాల వెనక ఎంత పెద్ద శక్తులు ఉన్న వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బిల్డర్లు కొమ్ముకాస్తున్న  అజ్ఞాత శక్తుల వ్యవహారాలను బట్టబయలు చేస్తామని అన్నారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని టౌన్ ప్లానింగ్ ఏసిపి ఖుద్దుస్ హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...