కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగానే మంచినీటి బోర్వెల్ సాధించుకున్నాము
కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా చినలబుడు పంచాయతీకి చెందిన మాలసింగారం గ్రామంలో శనివారం ఉదయం 8 గంటల నుండి మంచినీటి బోర్వెల్ తవ్వుతున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి ఆధ్వర్యంలో అరకువేలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొస్య ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మంచినీటి కొరతను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ పత్రికల ద్వారా అర్జీల ద్వారా అధికారులకు విన్నవించినందుకే ఈ సామాజిక మంచినీటి బోర్వెల్ సాధించుకున్నామని ఇది కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమేనని ఈ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని పంచాయితీ ప్రజలు గ్రహించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పారు, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మన నవ యువ నాయకుడు పంచాయతీ సర్పంచ్ బురిడీ ఉపేంద్ర కి మరియు ఆర్. డబ్ల్యు, ఏ.ఈ కి వారి బృందం అంతటికీ పత్రికల్లో ప్రచురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పత్రిక సోదరులందరికీ అభినందిస్తు ధన్యవాదాలు తెలియజేశారు, మిగతా మోటార్, ట్యాంక్, గొట్టాలు, వాటర్ టెప్ కనెక్షన్లు త్వరలోనే బిగించి మంచి నీళ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు, ఈ కార్యక్రమంలో మొస్య దేవదాసు, మొస్య బుజ్జి బాబు, సుంకరి బాలమురళి, వార్డు నెంబర్ కిల్లో లక్ష్మి వార్డు నెంబర్ మొస్య నాగేశ్వరరావు, వాలంటీర్ ఎం అర్జున్ ఎం మిస్సియమ్మ, ఎం సుభాషిని,ఎం అరుణ, ఎం.జగన్నాథం గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మహిళలు యువత పాల్గొన్నారు.
No comments:
Post a Comment