వారం రోజులు కరోన బంద్ పాటించాలని కార్మికులకు ఐఎఫ్టియు పిలుపు
కేసముద్రం, పెన్ పవర్కరోన రెండవ దశ విలయతాండవం చేస్తున్నందున కేసముద్రం మార్కెట్లో, మిల్లులు, కంపెనీల వద్ద పని చేయు హమాలీ, కూలి, మిల్లు డ్రైవర్లు మే 3 నుండి10 వరకు వారం రోజులు బంద్ పాటించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియూ) రాష్ట్ర నాయకులు కామ్రేడ్ శివారపు శ్రీధర్ పిలుపునిచ్చారు. సోమవారం మార్కెట్ ఆవరణలో మార్కెట్లో పని చేయు హమాలీ కార్మికులతో హమాలి యూనియన్ అధ్యక్షులు మిట్టగడపల వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో శివారపు శ్రీధర్ పాల్గొని మాట్లాడుతూ మండలంలో కరోన బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున హమాలీ కార్మికులు ఏకగ్రీవంగా మే 3 నుండి 10 వరకు తమ ఆరోగ్యాలు కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవడానికి వారం రోజులపాటు పని బంద్ చేయడానికి నిర్ణయించారు తెలిపారు. కార్మికులపై యాజమాన్యాలు ఒత్తిడి చేయవద్దని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్టియు) తరపున మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణ రావుకి, మార్కెట్ పాలకమండలికి, మార్కెట్ అధికారులకు, చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపారులందరికీ కార్మికుల తరపున విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో హమాలి, కూలీ యూనియన్ నాయకులు మిట్ట గడపల వెంకన్న, గుజ్జు పాపారావు, బిచ్చ, బోడ వెంకన్న, బట్టమేకల రాజు, భానోత్ సీతారాం, రత్యా, కృష్ణ, వెంకన్న, శ్రీను, సంపత్, బాలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment