నిరాడంబరంగా సీతారాముల కళ్యాణం
చిన్నగూడూరు, పెన్ పవర్
స్థానిక మండల కేంద్రంలోని చిన్నగూడూరు గ్రామంలో బుధవారం నాడు శ్రీరామనవమి వేడుకలు నిరాడంబరంగా సీతా రామ స్వామి కళ్యాణం జరిగినది. కరోనా మహమ్మారి పంజా విసురుతున్నవేల విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశ ఆరోగ్య వ్యవస్థ కుదేలవుతున సమయంలోతెలంగాణలో గత ఏడాది కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుండి పండుగలకు ప్రజలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గురువారం నాడు శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ చైర్మన్ శ్రీరామ్ నాగన్న ఆధ్వర్యంలో సీతా రాముల కళ్యాణన వేడుకలు కోవిడ్ నిబంధనలలొ భాగంగా ఆలయ అర్చకులతో పాటు కొద్ది మంది భక్తులు హాజరై మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. కళ్యాణ వేడుక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కొమ్ము మల్లయ్య దంపతులతో హాజరై శ్రీరామని కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ శ్రీరంగం జనార్ధన్, కార్యదర్శి బోనగిరి మురళి, ప్రతాపని శివయ్య, ఇరుకుల రమేష్, మంచాల గౌరీశంకర్, ఇతరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment