ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించిన ఎస్ ఐ వెంకట్
వి. ఆర్. పురం, పెన్ పవర్వి.ఆర్.పురం మండలం ఇందిరాగాంధీ సెంటర్ పరిధిలోఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఎస్ ఐ వెంకట్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వి.ఆర్.పురం ఎస్ ఐ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థినులు చదువు విషయంలోపోటీపడుతూ మంచి మార్కులతో పై స్థాయికి ఎదగాలి తప్ప పనికిరాని ఆలోచనలు రాకూడదు. ముఖ్యముగా బాలికలను ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడిన ఇబ్బంది పెట్టిన ర్యాగింగ్ చేసిన మాకు తెలియజేయండి. మీ కాలేజీలో లెక్చలర్లు ప్రతిరోజు వస్తున్నారా సిలబస్ పాఠాలు మంచిగా బోధిస్తు నారా మీకు అర్థమవుతుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీకి పంపిస్తున్నారు. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలి. కాలేజీలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థి ఒక స్థాయికి ఎదగాలి.అప్పుడే సమాజంలోతల్లిదండ్రులకు మీకు మంచి పేరు గౌరవం ఏర్పడుతుంది. వి.ఆర్.పురం ప్రభుత్వజూనియర్ కాలేజీ కూడా మంచి పేరు తేవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చలర్లు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment