Followers

డ్రైనేజీ పనులకు భూమి పూజ

 డ్రైనేజీ పనులకు భూమి పూజ...

ఆదిలాబాద్ , పెన్ పవర్ 

పట్టణ అభివృద్ధికి గానూ ప్రణాళికా బద్ధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వార్డు నెంబర్ రెండు పరిధిలో గల మహాలక్ష్మి వాడలో నలభై లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించనున్న అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శుక్రవారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేవారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పట్టణంలో ఐదు చోట్ల అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాబోయే వర్షాకాలం కంటే ముందు గానే ఈ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, అర్హులైన వారు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంద నర్సింగ్, పందిరి భూమన్న, మున్సిపల్ డిఇ తిరుపతి, నాయకులు సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...