Followers

ఉపాధ్యాయులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలి...

 ఉపాధ్యాయులను కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించాలి...

తాళ్లపూడి, పెన్ పవర్

పిల్లలతో నిత్యం మమేకం అయ్యే ఉపాధ్యాయ లోకాన్ని కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి టీకాలో ప్రాధాన్యత నివ్వాలని ఏ పి టి ఎఫ్ ప.గో.జిల్లా కార్యదర్శి దున్నా దుర్గారావు విజ్ఞప్తి చేశారు.  విద్యా బోధనకు ఉపాధ్యాయులు కావాలి, ఎన్నికల విధుల నిర్వహణకు ఉపాధ్యాయులు కావాలి, ఎన్నికల కౌంటింగ్ కు ఉపాధ్యాయులు కావాలి, పరీక్షల నిర్వహణకు ఉపాధ్యాయులు కావాలి, పేపర్లు దిద్దడానికి ఉపాధ్యాయులు కావాలి, డ్రై రేషన్ పంచడానికి ఉపాధ్యాయులు కావాలి, నాడు నేడు పనుల నిర్వహణకు ఉపాధ్యాయులు కావాలి, ఇలా ప్రతి పనికి ఉపాధ్యాయులు కావాలి.  ఇన్ని విధాలుగా ఉపాధ్యాయులు అనేక మంది మధ్య సంచరిస్తున్నారు. కానీ ఉపాధ్యాయులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి కరోనా వ్యాక్సిన్ వేయడానికి మాత్రం గుర్తించకపోవడం అన్యాయం అని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 130కు పైగా ఉపాధ్యాయులు కరోనా బారిన పడి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.  యుక్తవయసులో ఉన్న అనేక మంది ఉద్యోగులకు కూడా టీకాలు వేస్తున్నారు. కానీ ఉపాధ్యాయులను గుర్తించి వ్యాక్సిన్ వేయడం లేదు అని అన్నారు . కనుక  ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఉపాధ్యాయులందరికీ టీకా వేసేటట్లు చర్యలు తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. నాడు నేడు   రెండవ విడత శిక్షణా కార్యక్రమాలను, పనులను కొంతకాలం వాయిదా వేయాలని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...