అంగన్వాడీ టీచర్ జమాల్ బి చొరవతొ కదిలిన జనం
కరోనా టీకా కోసం 30 మంది ని ట్రాక్టర్ లో తరలింపు.
నెల్లికుదురు , పెన్ పవర్
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి టీకా శరణ్యమని ఎన్ని విధాలుగా చెప్పినా ప్రజలుసంకోచిస్తున్న తరుణంలో మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన అంగన్వాడి 3వ,సెంటర్ టీచర్ ఎస్ కె జమాల్ బి ప్రత్యేక చొరవతీసుకొని ప్రజలను చైతన్య పరిచారు.దీంతో ఆ గ్రామానికి చెందిన 30 మంది టీక వేయించుకోవడానికి ట్రాక్టర్ లో మండల కేంద్రంనెల్లికుదురు లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సోమవారం తరలి వెళ్లారు.వీరిని సంబంధిత అంగన్వాడి టీచర్ జమాల్ బి దగ్గరుండి మాస్కులు అందజేసి పంపించడం పట్ల గ్రామస్తులు అభినందిస్తున్నారు.
No comments:
Post a Comment