కరోనా సాకుతో కార్మికుల పొట్ట కొడతారా
వరదయ్య పాలెం, పెన్ పవర్
చిత్తూరుజిల్లా వరదయ్యపాలెం మండలం మరదవాడలోని భీమా డెవలపర్స్ క్వారీ పరిశ్రమ యాజమాన్యం కరోనా సాకుతో లాక్ డౌన్ విధించడంకు నిరసనగా కార్మికులు గురువారం క్వారీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సాకుతో లాక్ డౌన్ విధించి తమను వీదిపాలు చేసి పొట్ట కొట్టడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్ లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కి కరోనా వస్తె ఇక్కడ లాక్ డౌన్ విధించడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు లాక్ డౌన్ విధించిన సమయంలో కార్మికులకు జీవన భృతి కింద వేతనాలు చెల్లించాలని ఆదేశాలను ధిక్కరిస్తూ తమకు ఏమీ ఇవ్వకుండా విధుల నుంచి తొలగిస్తే తమను నమ్ముకున్న కుటుంబాలను ఎలా నిబంధనలు సైతం పాటించకుండా కార్మికులకి అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. క్వారి కి మాత్రమే అనుమతులు పొందిన యాజమాన్యం అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తూ దీన్ని ప్రశ్నిస్తారనే కారణంతో తమను లాక్ డౌన్ పేరిట తొలగించారని ఆరోపించారు. మైనింగ్ శాఖ అధికారులు, పరిశ్రమ శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.
No comments:
Post a Comment