Followers

కోవిడ్‌తో చనిపోయిన మహిళను బైక్‌పై తీసుకెళ్లిన కొడుకు, అల్లుడు

 కోవిడ్‌తో చనిపోయిన మహిళ మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తీసుకెళ్లిన కొడుకు, అల్లుడు



శ్రీకాకుళం, పెన్ పవర్

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కోవిడ్‌తో చనిపోయిన మహిళ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు డ్రైవర్లు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులు… చివరకు బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు.   శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కోవిడ్‌తో చనిపోయిన మహిళ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు డ్రైవర్లు ముందుకు రాలేదు. చాలా సేపు అంబులెన్సులు, ఆటోల కోసం ఎదురు చూసిన కుటుంబ సభ్యులు… చివరకు బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు. పలాస మండల కేంద్రంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. జిల్లాలోని మందస మండలం కిల్లోయి గ్రామానికి చెందిన గౌడ చెంచులు అనే మహిళ జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది. దీంతో పరీక్ష చేయించుకునేందుకు పలాసలోని ఓ ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్‌కు వెళ్లింది. అక్కడ స్కానింగ్‌ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.  కోవిడ్‌ భయంతో గౌడ చెంచులు మృతదేహన్ని తరలించేందుకు అంబులెన్స్, ఆటో డ్రైవర్లు ఎవ్వరూ ముందుకు రాలేదు. గంటల తరబడి వారిని ఎంతగా బతిమాలిన ఏ ఒక్కరూ స్పందించలేదు. మరోవైపు చీకటి పడుతుండటంతో కొడుకు, అల్లుడు ఇద్దరు కలిసి బైక్‌పై మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లారు.  బైక్‌పై మధ్యలో మృతదేహంతో సుమారు 20 కిలోమీటర్ల దూరం వారు బైక్‌పై ప్రయాణించారు. ట్రిపుల్‌ రైడింగ్‌ అని వాళ్లను ఆపిన పోలీసులు.. విషయం తెలుసుకుని చలించిపోయారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...