Followers

కొండ సముద్రం లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి

 కొండ సముద్రం లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి

పెన్ పవర్, వలేటివారిపాలెం

కరోనా సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ మన్నం వెంగమ్మ అన్నారు.  శనివారం కొండ సముద్రం గ్రామంలో ముందస్తు చర్యల్లో భాగంగా   సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని గ్రామం మెత్తం వీధి వీధిలో పిచికారి చేయించారు. కోవిడ్ వైరస్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తూ గ్రామం లో ర్యాలీ నిర్వహించారు.ఈ  కార్యక్రమం లో  ఉప సర్పంచ్ కొల్లి వెంకట నరసింహం, వైసీపీ నాయకుడు మన్నం వెంకట రమేష్,  ఫీల్డ్ అసిస్టెంట్ నలమోతు హరిబాబు, మరియు సచివాలయం సిబ్బంది గ్రామ వలుంటీర్స్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...