Followers

ఓ మానవుడా నిర్లక్ష్యం వీడు

 ఓ మానవుడా నిర్లక్ష్యం వీడు

రావులపాలెం,పెన్ పవర్

కరోనా సెకండ్ వేలో పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు కూడా మాస్కులు ధరించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలని బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు ప్రజానీకాన్ని కోరారు. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో జనం నిర్లక్ష్యం వీడి  అప్రమత్తంగా ఉండాలని బీజేపీ నేత గండ్రోతు వీరగోవిందరావు ప్రజల్ని కోరారు గత ఏడాది కాలంలో కోవిడ్ కారణంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డ మనందరికీ మళ్ళీ ఈ 2021  సంవత్సరంలో కరోనా సెకండ్ వేలో కూడా అష్ట కష్టాలను పెడుతుందన్నారు.రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోటలో మంగళవారం నాడు తన స్వగృహం వద్ద వీరగోవిందరావు మాట్లాడుతూ.దేశ వ్యాప్తంగా కరోనా ముప్పు మళ్ళీ కమ్ముకోస్తున్న వేళ మనల్ని మనమే రక్షించుకునేందుకు కాపాడుకునేందుకు ప్రతీ పౌరుడు సమాజం పట్ల బాధ్యతగా మసులుకోవాలన్నారు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కును ధరించి భౌతిక దూరం పాటిస్తూ ప్రజా క్షేమం కోసం మన కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు.  కోవిడ్ ఒక పక్కన కరోనా అతలాకుతలం చేస్తున్న అందరిని హాడలెత్తిస్తు గాల్లో దూసుకొస్తున్న కానీ కొంతమంది కి అవగాహన లేకుండా ఉన్నారన్నారు మాస్కులు పెట్టుకోకుండా  రోడ్లపై తిరగడం మాస్కులు లేకుండా ముచ్చదించటం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు  కుటుంబాల కోసం సమాజం కోసం ఎవరైనా సరే ప్రతీ ఒక్కరు బాధ్యతగా బాధ్యత గల పౌరులుగా నడుచుకోవాల్సిన సమయమన్నారు దేశ ప్రజల క్షేమం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు అన్ని విధాలుగా కూడా కోవిడ్ కట్టడి కొరకు నియంత్రణ కోసం ప్రజా శ్రేయస్సు కోసం అలుపెరుగని పోరాటం చేస్తు శ్రమిస్తున్నారన్నారు ముందోస్తుగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమక్షించడం పాటుగా ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారన్నారు మనమంతా కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ విపత్కర కరోనా పరిస్థితులు సక్కబడేవరుకు వీలైనంత వరకు  పెద్దా చిన్నా అంతా కూడా ఇంటికే పరిమితం కావాలన్నారు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు ఒక పక్క వైద్యులు పోలీసులు అధికారులు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్న గాని కొంతమంది మాకేం కాదులే మాకు కరోనా రాదులే అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు సమాజానికి మంచిది కాదన్నారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్న కానీ ఎవరు ఎవరిని ముంచుదామని గుంపు గుంపులుగా గుమిగూడటం మాస్కులు పెట్టుకోకుండా తిరగటమన్నారు మహమ్మారి భారిన పడకుండా ఏ కుటుంబాన్ని ఆ కుటుంబ సభ్యులు అందరి కలిసి బాధ్యతగా ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తే అందరికి శ్రీరామరక్ష అని ఆయన అన్నారు ఇప్పుడున్న పరిస్థితులల్లో ఎవరోనో నిందించి ఎవరినో విమర్శలు చేసే సమయ సందర్భాలు ఇవి కాదన్నారు మనల్ని మనమే కుటుంబాలను రక్షించేందుకు మాస్కులను రక్షణకవచంలాగా ఉపయోగించుకుంటు ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు  మాస్కులే మనకు ప్రస్తుతం రక్షణగా పనిచేస్తున్నాయన్నారు నిర్లక్ష్యం చేయకుండా ఎవరికి వారు వాటిని వినియోగిస్తు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపర్చుకోవడం గోరు వెచ్చని నీరును సేవించడం తాజా ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యాలమేలన్నారు మనో ధైర్యంతో ముందుకు సాగాలన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...