కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవల తో పాటు పౌష్టికాహారం అందించండి
చిత్తూర్, పెన్ పవర్
జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నోడల్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ కోవిడ్ బాధితులకు సకాలంలో వైద్య సేవలతో పాటు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ ఆసుపత్రుల నోడల్ అధికారులు మరియు జిల్లా నోడల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19 సమీక్ష నిర్వహిస్తూ కోవిడ్ వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల యందు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్కులలో సంబందిత ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న ఐసియు, నాన్ ఐసియు పడకల వివరాలు ఉండాలని ఆ ఆసుపత్రికి కేటాయించిన నోడల్ అధికారి రెండు గంటలకు ఒక సారి ఈ విషయం పై సమాచారాన్ని తీసుకోవాలని దీనితో పాటు పౌష్టికాహారాన్ని కోవిడ్ బాదితులకు అందేలా చూడాలని తెలిపారు. ఆసుపత్రుల యందు పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా తరచూ వైద్యులు కోవిడ్ కేర్ కేంద్రాల యందు మరియు ఆసుపత్రుల యందు పర్యవేక్షించేలా నోడల్ అధికారులు పని చేయాలని తెలిపారు. కరోనా టెస్టుల యొక్క ఫలితాలను వెంటనే సకాలంలో ఇవ్వాలని టెస్టు ల యొక్క వివరాలను వెంటనే ఆన్ లైన్ లో పొందు పరచి వైధ్యాదికారులకు ఇవ్వాలని స్విమ్స్, రుయా సూపరిండ్oట్ లు, ఇంచార్జ్ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని ట్రయాజింగ్ కేంద్రాలను పెంచడమైందని ఇది వరకే తిరుపతి లో ఉన్న ట్రయాజింగ్ కేంద్రాలకు అదనంగా ఒక్కో నియోజక వర్గానికి ఒక ట్రయాజింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ కేంద్రం నందు వైధ్యులు సిబ్బంది ఎక్స్ రే యూనిట్, రక్త పరీక్షలు చేసేలా అన్ని సిద్దం చేయాలని జిల్లా ట్రయాజింగ్ నోడల్ అదికారి డా.రవి రాజు ను ఆదేశించారు. కోవిడ్ ఆసుపత్రుల యందు మందులను అందుబాటులో ఉంచాలని ధనుంజ యులు ను ఆదేశించారు. ప్రతి కాంటాక్ట్ కేసుకు సంబందించిన కాంటాక్ట్ వ్యక్తులను మ్యాపింగ్ చేసి సర్వే బృందం లేదా ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించాలని కాంటాక్ట్ నోడల్ అధికారి డా.రమాదేవిని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ కు సంబందించి ఇతర సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
No comments:
Post a Comment