Followers

ఇటుకల పండుగల్లో వాహనాలు ఆపి నిర్బంధ వసూలు...

 ఇటుకల పండుగల్లో  వాహనాలు  ఆపి నిర్బంధ వసూలు

పెన్ పవర్, విశాఖపట్నం

 ఏజెన్సీలో ఆదివాసీ గిరిజనులు  ఇటుకల పండగ పేరుతో రహదారులపై వాహనాలను ఆపి నిర్బంధ వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేయాలని పాడేరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ డాక్టర్ శారద అన్నారు. సోమవారం  విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ బద్ధంగా జరుపుకునే ఇటుకల పండగలను స్వాగతిస్తామని కానీ ఆచారాల పేరుతో రోడ్లపై రాళ్లు కర్రలు అడ్డం పెట్టి  వాహనాలను బలవంతంగా ఆపి వాహనదారుల నుంచి డబ్బులు పిండి వసూలు చేయడం  చట్టపరంగా నేరం అన్నారు. ఈ మేరకు గిరిజనులు ఇటుకల పండగలను ఆటపాటలతో ఆనందంగా నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. ఏజెన్సీ 11 మండలాల్లో ఇటుకల పండగలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఆదివాసీ గిరిజనులు చట్టాలను గౌరవించి  రోడ్లపై నిర్బంధ సెక్స్ వసూళ్లు చేపట్టవద్దని ఆమె పిలుపునిచ్చారు. ఎక్కడైనా  రోడ్లకు అడ్డంగా వాహనాలపై డబ్బులు వసూలు చేపడితే  పోలీసులు కేసులు పెట్టాలని  మెజిస్ట్రేట్ డాక్టర్ శారద హెచ్చరించారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...