సూరిబాబు సేవలు చిరస్మరణీయం..
మండల రజక సంఘం అధ్యక్షుడు దాకమర్రి సూరిబాబు సేవలు చిరస్మరణీయమని మండల సిపిఎం కార్యదర్శి పాకలపాటి సోమరాజు అన్నారు. ఈ మధ్య అకాల మరణం చెందడం పట్ల సంతాప సభ జరిగింది. ఈమేరకు బుధవారం సూరిబాబు చిత్రపటానికి పూలమాల వేసి,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా మండల రజక సంఘం అధ్యక్షునిగా పనిచేస్తూ రజకులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, దోబీ ఘాట్ నిర్మాణం తో పాటు, మండలంలోని రజకులకు సొంత సొమ్ముతో బీమా చేయించి వారి కుటుంబాలకు చేయూతనందించిన ఘనత సూరిబాబుకు దక్కుతుందని కొనియాడారు. పట్టణ రజక సంఘం అధ్యక్షుడు అంజూరు రాజారావు, కేళం శ్రీను, గుసిడి పాపయ్య, పసుపులేటి రాజబాబు, సిప్పాడ ప్రసాద్, మద్ది కనకరాజు, వానపల్లి అప్పారావు ఉన్నారు.
No comments:
Post a Comment