సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ...
విశాఖపట్నం, పెన్ పవర్
సర్వోన్నత న్యాయ పీఠం పై తెలుగు తేజం ఎన్వి రమణ ని నియమించడం పట్ల హర్షం వ్యక్తపరిచిన ఎ.డి.సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, అగనంపూడి ప్రముఖ న్యాయవాది గోడి రామకృష్ణ తన కార్యాలయం వద్ద భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ని నియమించిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్వి రమణ ఆంధ్ర రాష్ట్రం కృష్ణాజిల్లాలో సామాన్య రైతు కుటుంబం నుండి భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అవ్వడం తెలుగువారంతా గర్వించదగ విషయం ఆయన ఆంధ్ర రాష్ట్ర విభజనలో చట్టపరంగా మనకు రావలసినని ఏర్పాటు చేయాలని మాతృభాషలో న్యాయ తీర్పులు ఇచ్చుటకు తగు చర్యలు తీసుకోవలని కోరారు.అగనంపూడి నటరాజా కళా సమితి అధ్యక్షులు కట్ట పైడ్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పెద్ద మడక శ్రీ పైడిమాంబ ఆలయ కమిటీ చైర్మన్ గంతకోరు అప్పారావు,అగనంపూడి సిడబ్ల్యూసి కార్యదర్శి వంకర.రాము ,సీనియర్ సిటిజన్ ఎ.దేవదాసు,ఉక్కు కార్మిక నాయకులు మంత్రి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment