నాచారం డివిజన్లో మేయర్ పర్యటన
తార్నాక , పెన్ పవర్నగర మేయర్ విజయలక్ష్మి నాచారం డివిజన్ లో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ తో కలిసి విస్తృతంగా పర్యటించి డివిజన్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ శాంతి పలు సమస్యలను మేయర్ దృష్టి కి తీసుకొనివచ్చారు. పటేల్ కుంట చెరువు పూర్తిగా దుర్గంధ భరితమైన దీనివల్ల నాచారం లో దోమలు విపరీతంగా పెరిగాయని తక్షణమే చెరువులో పేరుకుపోయిన తొలగింపు పనులు ప్రారంభించాలని మేయర్ కు విజ్ఞప్తి చేశారు. పటేల్ కుంట చెరువు నుండి హెచ్ఎంటి నగర్ చెరువు వరకు ఉన్న పెద్ద నాలా ఇరువైపులా గోడ పూర్తిగా కూలిపోయిందని తక్షణమే రిటైనింగ్ వాల్ నిర్మించాలని, ఇదే నాలా పై ఉన్న మూడు బ్రిడ్జిలు శిధిలావస్థలో ఉన్నాయని వాటిని పునర్నిర్మించాలని కోరారు. ఆరు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న నాచారం హిందూ స్మశాన వాటికను శాంతి వనంగా తీర్చిదిద్దాలని కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, మేయర్ కు విజ్ఞప్తి చేశారు. వీటన్నింటికీ సానుకూలంగా స్పందించిన మేయర్ విజయలక్ష్మి అధికారులకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకుగాను కృషి చేస్తున్నామని ఈ సందర్బంగా మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ అధికారులు నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment