భజన మందిరం ప్రారంబించిన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి
సీనియర్ సిటిజన్స్ సేవలో ముందు నడుస్తున్న కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్.
పెన్ పవర్, మల్కాజిగిరి
కుషాయిగూడలోని బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ లు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ సీనియర్ సిటిజన్స్ కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాలలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుంటుందని చర్లపల్లి, ఏఎస్ రావు నగర్ డివిజన్ ల కార్పొరేటర్ లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి లు పేర్కొన్నారు. కుషాయిగూడలో బుధవారం రాత్రి భజన మందిర్ ఆవరణలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్ భవనాలను మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి,వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిలతో కలిసి కార్పొరేటర్లు శ్రీదేవి, శిరీష లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలు సర్వతోముఖాభివృద్ధి సాధించడంలో సంక్షేమ సంఘాల పాత్ర క్రియాశీలక మయిందన్నారు. డివిజన్ పరిధిలోని కాలనీల అభివృద్ధిలో భాగంగా కుషాయిగూడ కు మరింత ప్రాధాన్యతను కల్పిస్తూ అభివృద్ధి ఫలాలు అందజేస్తామన్నారు. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ వారు వయోవృద్ధుల కోసం చేపడుతున్న అనేక కార్యక్రమాలు వారిలో మనోధైర్యాన్ని నింపేలా ఉన్నాయని కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి,సింగిరెడ్డి శిరీష రెడ్డి లు ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ సేవలను కొనియాడారు. మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ గ్రామంలో శిధిలావస్థకు చేరుకున్న భజన మందిర్ స్థానంలో తన హయాంలో అవసరమైన నిధులను విడుదల చేయించి కొత్త భవనం నిర్మాణం చేయించడం జరిగిందన్నారు. తన ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భజన మందిరం కుషాయిగూడ గ్రామ వాసులకు వయోవృద్ధులకు ఉపయోగపడడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కుషాయిగూడ గ్రామానికి చెందిన అనేక మంది యువత ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువత కోసం దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో అధునాతన జిమ్ వ్యాయామ శాలను ఏర్పాటు చేయనున్నట్లు సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ముందుగా కుషాయిగూడ గ్రామానికి చెందిన పలువురు వయోవృద్ధుల ను కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, సింగిరెడ్డి శిరీష లు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు చక్రపాణి గౌడ్ పబ్బ చంద్రశేఖర్, చిత్తుల విష్ణు గౌడ్, రాగుల వాసుదేవ ముదిరాజ్, పంజాల బాబు గౌడ్, చెన్నోజు వరప్రసాద్, చిత్తుల కిషోర్ గౌడ్, బాల్ నరసింహ, బ్రహ్మచారి, శ్రీకాంత్ యాదవ్, నర్సింగ్ రావు, నర్సింగ్ గౌడ్, శంకర్ గౌడ్, దినేష్, సన్నీ, నందు, చల్ల సురేష్, వీరబ్రహ్మం, సాయి కిరణ్, మణికిరణ్, నాయకులు గణేష్ ముదిరాజ్, కాసుల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment