రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఆరోగ్య భధ్రత కల్పించాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి రహీం
రామగుండం , పెన్ పవర్మన తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకి ఆరోగ్య భద్రత కల్పించాలని రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి రహీం ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. కరోన సెకండ్ వేవ్ విజృంబిస్తున్న క్రమంలో కరోన సోకి పలువురు జర్నలిస్టులు మరణించిన ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమౌతుందని జర్నలిస్టుల పై తెరాస ప్రభుత్వానికి ఉన్న వారి పట్ల బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనమని ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని జర్నలిస్టులను ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్-గ్రేషియా అందించాలని వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించి వారికి భీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
No comments:
Post a Comment