Followers

పారిశుద్ధ్యం ప్రకటనలకే పరిమితమా ?

పారిశుద్ధ్యం ప్రకటనలకే పరిమితమా ?

నాచారం డివిజన్ లో రోడ్ల పై మురుగు 

తార్నాక ,  పెన్ పవర్ 

పారిశుద్ధ్యం ప్రకటనలకే పరిమితమా ? ఆచరణలో మాత్రం ఎక్కడా పారి శుద్ధ్యపనులు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదని నాచారం డివిజన్ ప్రజలు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం , పర్యవేక్షణ లేకపోవడంతో నాచారం డివిజన్ లో ప్రజలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాఘవేంద్ర నగర్ లో మురుగు రోడ్డు పై పొర్లుతుండటంతో పాదచారులు , వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.  గత వారం రోజులుగా డ్రైనేజి మురుగు రోడ్డు పై  నిలిచి ఉన్న అధికారులుగాని, ప్రజాప్రతినిదులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రక్క కరోనా తీవ్ర స్థాయి లో వ్యాప్తి చెందుతుంటే, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలిసిన అధికారులు, ఎన్ని పిర్యాదులు చేసిన ఇటు వైపు కన్నెత్తి చూడకపోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజి మురుగు వారం రోజులుగా నిలిచి ఉండటంతో దుర్వాసన రావడమే కాకుండా, దోమలు పెరిగాయని, తాము అనారోగ్యంపాలు అవుతామని స్థానికులు ఆవేదన వ్యక్థము చేస్తున్నారు. కరోనా భయంతో ఉన్న ప్రజలు నిల్వ ఉన్న మురుగుతో అంటువ్యాదులు ప్రబలుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ జేబులు నింపు కోవడానికి  నాసిరకంగా పనులు చేయడం తో కొద్దిరోజులకే సమస్యలు మొదలయ్యాయని , ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు ఇప్పటికైనా అలసత్వం వీడి  శాశ్వత పరిష్కారం చూడాలని స్థానికులు కోరుతున్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...