ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసిన ఎస్ఐ
నార్నూర్, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ పంచాయతీ లో సోమవారం ఎసై మాదాసు విజయ్ కుమార్ చేతుల మీదుగా ప్రజలకు ఉచితంగా 50 మాస్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపత్యంలో ప్రజలు గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా ప్రతిఒక్కరు మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించాలన్నారు. వాహనాలను అపి ప్రయాణికులకు డ్రైవర్ లకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించని వారికి వాహన పత్రాలు లేని వారికి జరిమాన విధించారు. నియమాలను పాటించని యెడల చటం ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎసైలు ప్రవళిక, ధనశ్రీ, ఉపసర్పంచ్ విష్ణు గ్రామస్తులు సుభాష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment