Followers

దళిత అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి

 దళిత అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి - పన్నాల

తార్నాక ,  పెన్ పవర్  

డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ 113 వ జయంతి సందర్బంగా మల్లాపూర్ అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి అతిధులు గా  స్థానిక  కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి , హోసింగ్ బోర్డు కార్పొరేటర్ ప్రభుదాస్ లు పాల్గొని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ వారు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని తెలిపారు.దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేసారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అరుంధతి సంక్షేమ సంఘం ప్రతినిధులు మల్లేష్ , ప్రకాష్ , శ్రీను , రాజు , యేసు , ఈశ్వర్ , రవి , నర్సింహా , వెంకటేష్ , స్థానిక నాయకులు కటార్ల భాస్కర్ , సురణం రాజేశ్వర్ , నరేందర్ , విజయ్ పాల్గొన్నారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...