సింగిడి మొగ్గల కవిత్వ పుస్తక ఆవిష్కరణ
చిన్నగూడూరు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శనివారం నాడు కవి,రచయిత,కొలిపాక శ్రీనివాస్ రచించిన కవిత్వం పుస్తకాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం ఏ రెహమాన్ చేతుల మీదుగా కవి కొలిపాక శ్రీనివాస్ ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా ఎం ఏ రెహమాన్ మాట్లాడుతూ తన తొలి పుస్తకం సింగిడి కవిత్వాన్ని సామాజిక అంశాలతో కూడిన కవితలను కొలిపాక శ్రీనివాస్ రాయడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే తరువాత కాలంలో ఇది పిల్లలకు పాఠ్యాంశంగా వాచకాలలో అచ్చు కావాలని కోరారు. కవి రచయిత కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తన తొలి మొగ్గల కవిత సంకలనం సింగిడి పుస్తకాన్ని మహాకవి దాశరధి ఊరైన చిన్నగూడూరు ఆవిష్కరించడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందని వారు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంపటివిజయరాజు ,నాగేశ్వరరావు, సత్యం సతీష్, సురేష్ శ్రీనివాస్ రెడ్డి, జగన్ మోహన్ ఆచార్యులు, రేణుక దేవి, పుష్పలిల, సోనీ, లలిత, హారతి, ఎల్లారెడ్డి, నాగార్జున మొదలగువారు అభినందనలు తెలిపి పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment