Followers

కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పటిష్టమైన చర్యలు

కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పటిష్టమైన చర్యలు

చిత్తూరు,  పెన్ పవర్

మంగళవారం స్థానిక జిల్లా సచివాలయం లో అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన గ్రీవెన్సెస్, తదితర అంశాల పై వివిధ జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా నివారణా చర్యలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా లేబర్ బడ్జెట్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, డా. వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడీ కేంద్రాలు, ఇంటి పట్టాల పంపిణీ, స్పందన గ్రీవెన్సెస్ పై తీసుకున్న చర్యల పై సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయ భవనాలు అలాగే రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లు, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా 104 కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు బాధితులను మానిటర్ చేస్తుండాలన్నారు. 45 సం.ల పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులలో పడకల స్థాయిని పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో స్యానిటేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలన్నారు. ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఇంటి పట్టాలు అన్నీ రాబోయే 15 రోజుల లోపు పంపిణీకు చర్యలు చేపట్టాలని తెలిపారు. స్పందన ద్వారా వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండాలన్నారు. స్యానిటేషన్, వీధి లైట్ లు, త్రాగు నీరుకు సంబంధించిన సమస్యల పై నిరంతరం సమీక్షిస్తుండాలన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరిస్తూ కోవిడ్ సెకండ్ వేవ్ లో భాగంగా జిల్లా లో కోవిడ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా కోవిడ్ కట్టడికి 19 మంది నోడల్ అధికారులను వివిధ అంశాలను పర్యవేక్షించేందుకు నియమించడం జరిగిందని, అలాగే 104 కాల్ సెంటర్ ద్వారా మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కోవిడ్ బాధితులకు సలహాలు, సూచనలు అందించడం జరుగుతూ ఉందని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాధితులకు అవసరమైన వైద్య సేవలు, సూచనలు, సలహాల నిమిత్తం డాక్టర్ల ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, అలాగే కోవిడ్ కేర్ కేంద్రాలల్లో స్యానిటైజేషన్, తదితర వసతులకు చర్యలు తీసుకోవడం జరిగిందని ముఖ్యమంత్రికి వివరించారు.  ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎస్.పి సెంథిల్ కుమార్, ట్రైనీ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఎం అండ్ హెచ్ఓ డా. పెంచలయ్య, డిసిహెచ్ఎస్ డా. సరళమ్మ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ అమరనాథ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...