ప్లాస్టిక్ పై పట్టింపేది...!
పట్టణంలో యథేచ్ఛగా వినియాగం
పర్యావరణానికి తప్పని ముప్పు
పట్టించుకోని అధికారులు
లక్షెట్టిపెట్, పెన్ పవర్
ప్లాస్టిక్ రక్కసిని తరిమేద్దాం.ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేద్దాం అంటూ పాలకులు అధికారులు ప్లాస్టిక్ నిషేధం అంశాన్ని గాలికి వదిలేశారు.కేవలం అది పత్రికలకు ఫ్లేక్సీలపై ప్రకటన లకు పరిమితమైంది.లక్షెట్టిపెట్ పట్టణంలో ప్రతి ఆదివారం, గురువారం నిర్వహించే వారాంతపు సంతతో పాటు నిత్యవసర సరుకులు, కూరగాయలు వంటి వాటికి సైతం ప్లాస్టిక్ కవర్లనే వాడుతున్నారు. ఇటీవల హోటళ్లు, చికెన్ మటన్ దుకాణాల్లోనూ వీటి వినియోగం బాగా పెరిగింది వాటిని అరికట్టాల్సిన అధికారులు దాని ఊసే ఎత్తకపోవడం శోచనియం.. నాడు చెప్పారు..నేడు మరిచారు. ప్లాస్టిక్ వినియోగించడంతో జరిగే నష్టలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీ గ్రామంలో కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు మండల కేంద్రంలో ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు. ఆ కొద్దీ రోజులు మాత్రమే ప్లాస్టిక్ పై నిషేధం కొనసాగింది ఆ తరువాత పరిస్థితి పాతకే వచ్చింది. పొంచి ఉన్న ముప్పు...ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో అదే స్థాయిలో పర్యావరణానికి ప్రమాదం పొంచి ఉంది నీళ్లు కలుషితం కవడమూ, ప్లాస్టిక్ గ్లాసుల ద్వారా చల్లని పానీయాలు సేవించడమే కాకుండా అదే ప్లాస్టిక్ కవర్లలోనే పార్సిళ్ళు తీసుకెళ్లడం జనానికి అలవాటైపోయింది, అంతే కాకుండా చికెన్ మటన్ లకు సైతం నాణ్యతలేని కవర్లను వినియెగిస్తున్నారు. 51మైక్రాన్ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ను వినియోగించాలని నిబంధనలు ఉన్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు.. చర్యలు చేపడుతాం.. మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ప్లాస్టిక్ వాడకం నిషేదించినం కానీ కొంతమంది అవీ ఏమి పట్టించుకోవడం లేదు. దుకాణాలను హోటళ్లను తనిఖీ చేసి ఒకవేళ ఎవరు అయిన ప్లాస్టిక్ వాడినట్లు అయితే వెయ్యి రూపాయల నుండి యాబై వేల రూపాయల వరకు జరిమానా విధించి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం..
No comments:
Post a Comment