వడదెబ్బతో యువకుడు మృతి
పెద్దగూడూరు, పెన్ పవర్మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్ళపల్లి గ్రామానికి చెందిన వీరబోయిన విజేందర్(23) వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజేందర్ గత రెండు రోజులుగా పొలం పనులకు వెళ్ళాడు. ఎండలు తీవ్రంగా ఉండటంతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానిక వైద్యుడి వద్ద వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండగా మెరుగైన చికిత్సకోసం నర్సంపేట హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే విజేంధదర్ చనిపోయాడని వైద్యులు తెలుపడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. వారి కుటుంబాన్ని అన్నివిధాల అదుకుంటామని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మబోయిన వేణు అన్నారు. కుటుంబాన్ని అదుకుంటామని బరోస ఇచ్చారు.
No comments:
Post a Comment