మాల సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమాధికారికి సన్మానం...
ఆదిలాబాద్ , పెన్ పవర్జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా బాద్యతలను స్వీకరించిన కడారి రాజలింగును జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన సంఘం నేతలు పూలమాల, శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు సూరం భగవాండ్లు, అల్లూరి భూమన్నలు మాట్లాడుతూ గుమాస్తాగా నియామాకమై జిల్లా అధికారిగా ఆదిలాబాద్కే రావడం దళితజాతికే గర్వకారణమని కొనియాడారు. బాద్యతల నిర్వహణలో పదవీకి మరింత వెన్నే తెవాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం డిస్ట్రిక్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు సూరం భగవాండ్లు, అల్లూరి భూమన్న, బేర శ్రీనివాస్, సూర్యవరప్రసాద్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment