Followers

ముంపు మండలాల్లో "అలర్ట్" అయిన పోలీస్ అధికారులు

 ముంపు మండలాల్లో "అలర్ట్" అయిన పోలీస్ అధికారులు

 వి.ఆర్.పురం, పెన్ పవర్

ముంపు మండలాల్లో మావోయిస్టుల బంద్ కారణంగా వి.అర్.పురం, చింతూరు కూనవరం, యటపాక పోలీసులు అలర్ట్ అయ్యారు. పక్క రాష్ట్రాల నుండి కొత్తగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్  లోకి ప్రవేశిస్తే వారిపై నిఘా ఏర్పాటు చేశారు.  మండలంలోఇప్పటికే వాహనాలను ఆపి తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను ఆరా తీస్తున్నారు. ఒక వైపు కొవిడ్ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో  చింతూరు ఐటిడిఎ పిఓ వెంకటరమణ ఆదేశాల మేరకు రెవిన్యూ తహశీల్దార్ లు  ఇప్పటికే ముంపు మండలాల్లో ఉన్న వారపు సంతలను నిలుపుదల చేశారు. ఒక వైపు కరోనా, మరో వైపు మావోయిస్టుల బంద్ తో పోలీస్, శాఖ రెవెన్యూ  శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.  ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని,  మనిషి మనిషికి దూరం పాటించాలి. డెటాల్ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇంట్లో నుండి పని ఉంటేనే బయటకు రావాలి. వి.అర్.పురం యస్. ఐ లు చంటి, వెంకటేష్ మండలంలోని ప్రజలకు  కోవిడ్ పై అవగాహన తెలియజేసినారు.  ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది. వాహనదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...