బస్తి దవాఖానలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించిన కార్పొరేటర్
కోవిడ్ నబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొవాలి
పెన్ పవర్, మల్కాజిగిరిమల్కాజిగరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఏకలవ్య నగర్ బస్తి దవాఖాన లో కరోన వ్యాక్సినేషన్ సెంటర్ ను స్థానిక కార్పొరేటర్ మేకల సునిత రాముయదవ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ లో మరో రెండు చోట్ల వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ మేకల సునిత రాముయాదవ్ తెలిపారు. రెండో దశ కోవిడ్ - 19, కరోనా విజృంభిస్తున్న నేఫధ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి, భౌతిక దూరం పటించి, శానిటైజర్ తో ఎప్పటికప్పడు శుభ్రం చేసుకొవాలని, కోవిడ్ వైరస్ నుండి సురక్షితంగా నగర ప్రజలు ఉండాలని సూచించారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతీ ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాముయదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment